Tuesday, 24 July 2018

Coir Museum (పీచు మ్యూజియం )Kalavoor (Alappuzha)

అలెప్పీ వెళితే తప్పక చూడాల్సిన వాటిలో ఒకటి.ఎక్కువ మంది, పీచు మ్యూజియం - ఏముంటుందిలే చూడటానికి అనుకుని వెళ్లక పోవచ్చు.విషయాసక్తి ఉన్న వాళ్లకి తప్పకుండా నచ్చుతుంది . 

ఈ మ్యూజియం,కొబ్బరి పీచు పరిశ్రమ 60 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భం గా కాయిర్ బోర్డు కాంప్లెక్స్ లోనే 2014 లో కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ ప్రారంభించారు.ఈ సందర్భం గా భారత ప్రభుత్వం 60 రూపాయల నాణెం విడు దల చేసింది.



ఈ మ్యూజియం లో కొబ్బరి పీచు తో  చేసిన బొమ్మలు,పీచు తీసే యంత్రాలు,పీచు  నుంచి తాళ్లు ,కాళ్ళు తుడుచుకునే పట్టాలు తయారు చేసే యంత్రాలు ఉన్నాయి.కొబ్బరి పీచు తో చేసిన కొన్ని బొమ్మలు ...






















కనిపిస్తున్న ఇంటి నమూనా లో వాడిన తలుపులు, కిటికీ లు, గోడలు అన్నీ కొబ్బరి పీచు +ప్లై వుడ్  కాంబినేషన్ లో తయారయ్యాయి. ఇవి ఫైర్ మరియు వాటర్ ప్రూఫ్ అంట. బెంగళూరు కాయిర్ బోర్డు వారి దగ్గర మాత్రమే ప్రస్తుతం లభిస్తున్నాయి.

   
కొబ్బరికాయలు నుంచి పీచు - దాని నుంచి తాళ్లు,ఇతర వస్తువుల  తయారీ ప్రాసెస్ ... బొమ్మల తో .

మ్యూజియం చూసిన తర్వాత, దగ్గర లో ఉన్న మరారికులం బీచ్ కి వెళ్ళాము. బీచ్ కి వెళ్లే దారిలో మహాదేవ (శివుడు) గుడి ఉంది.బీచ్ నుంచి వస్తూ శివుడు ని దర్శించుకుని వచ్చాము.








Wednesday, 20 June 2018

స్వీట్ కార్న్ ,రాజ్మా అడై


 ఆరోగ్యకరమైన అల్పాహారం 

కావాల్సిన పదార్ధాలు :
  • బియ్యం  – 1 కప్పు 
  • స్వీట్ కార్న్ – 1 కప్పు 
  • రాజ్మా  – 1/2 కప్పు 
  • శనగపప్పు  – 1/2 కప్పు 
  • పెసరపప్పు  – 1/4 కప్పు 
  • కరివేపాకు   – 2 రెబ్బలు 
  • ఇంగువ  – 1/4 టీ స్పూను 
  • ఎండుమిరపకాయలు  – 5
  • ఉప్పు తగినంత  




తయారు చేసే విధానం :


బియ్యం,శనగపప్పు,రాజ్మా,పెసరపప్పు ను నాలుగు గంటలు నానపెట్టుకోవాలి  
నీరు వంపేసి, కరివేపాకు ఎండుమిరపకాయలు వేసి గ్రైండ్ చేసుకోవాలి 
రుబ్బిన పిండిలో ఉప్పు, ఇంగువ వేసి కలుపుకోవాలి 
రుబ్బిన పిండిని రెండు మూడు గంటల తర్వాత వాడుకోవచ్చు 
బెల్లం తో గానీ కొబ్బరి చట్నీ తో గానీ 
 వేడి వేడిగా తింటే బాగుంటుంది.  




Wednesday, 13 June 2018

Torch Ginger ...



అల్లం ... తెలియని/చూడని  వాళ్ళు ఉండరేమో ! ఆ మొక్కను ఎంతమంది చూసి ఉంటారో తెలియదు.అల్లపు మొక్కకి ,అల్లం జాతికి చెందిన ఇతర మొక్కలకి పూలు పూస్తాయన్న సంగతి తెలుసా ?వెయ్యి కి పైనే అల్లం జాతి మొక్కలు ఉన్నాయి.వాటిలో ఓ మూడు  రకాలు నేను చూసాను.ఆ మొక్కల పూల ఫోటోలు    మీ కోసం 

మొదటగా చూసింది - Costus pictus  (Painted spiral ginger) అప్పటికి అది అల్లం జాతి మొక్క అని తెలియదు.మా పిన్నికి తెలిసిన వారు, ఈ మొక్క ఆకులు తింటే షుగర్ తగ్గుతుంది అని చెప్పి ఇచ్చారంట.ఆకులు పుల్లగా ఉన్నాయి.టేస్ట్ బాగుంది, తినొచ్చు అని అనుకున్నాము.మొక్క పేరు తెలియదు.ఆ తర్వాత అదే మొక్కను మా ఎదురింటి వాళ్ళింట్లో చూసాను.పేరు ఏమిటి అని అడిగితే, తెలియదు ఆకులు తింటే షుగర్ తగ్గుతుంది అని నా ఫ్రెండ్ ఇచ్చింది. వేరే ఎవరికైనా అయితే ఆవిడ ఒక మొక్కను 500 కి అమ్ముతుంది.ఆకులయితే ఒక్కో ఆకు 10రూపాయలకు అమ్ముతుంది. నాకు ఫ్రీ గా ఇచ్చారు అని చెప్పారు.ఆ తర్వాత కొద్ది రోజులకు పూలు పూశాయి ,వచ్చి చూడండి అని చెప్పారు.(వాళ్ళింట్లో ఏ మొక్కకు పూలు పూసినా అందర్నీ పిలిచి చూపించటం ఆవిడ అలవాటు) పూలు చాలా అందం గా ఉన్నాయని నేను ఫోటో తీసుకున్నాను. ఆ తర్వాత గూగుల్ ఇమేజ్ సర్చ్ లో కొన్ని రోజులు పాటు ప్రయత్నించి  ఎట్టకేలకు పేరు కనుక్కున్నాను 😊   

COSTUS PICTUS


రెండోది Alpinia purpurata . రెడ్ జింజర్ అని కూడా అంటారు 



ఇక మూడోది  -  Etlingera elatior  టార్చ్ జింజర్ ,టార్చ్ లిల్లి ,ఫిలిప్పైన్ వాక్స్ ఫ్లవర్  అనేవి ఇతర పేర్లు. ఈ మొక్కని కుమిలీ  లో చూసాను. ఈ మొక్క పేరు తెలుసుకోవటానికి చాలానే కష్టపడాల్సి వచ్చింది.గూగుల్ ఇమేజ్ సర్చ్ లో ఎన్ని సార్లు ట్రై చేసినా దొరకలేదు.ఇక పేరు తెలుసుకోలేనే మో అనుకుంటున్న సమయం లో ... నేను జిగ్సా పజిల్స్ సాల్వ్ చేస్తూ ఉంటే ఒక పువ్వు బొమ్మకు మిజోరి బొటానికల్ గార్డెన్  అని ఉంది. గార్డెన్ పేరు ఇవ్వకపోతే     పువ్వు పేరే రాయొచ్చు కదా అనుకున్నాను.ఒక క్లూ దొరికింది అని సంతోషపడి , ఆ గార్డెన్ వెబ్సైటు కి వెళితే ... కొన్ని వేల రకాల పూల మొక్కల పేర్లు.ఆల్ఫాబెట్ వైజ్ చెక్ చెయ్యొచ్చు కానీ పేరు తెలియదు కదా ! చెక్ చేస్తున్నదే పేరు కోసం 😊  
మెనూ లో ప్లాంట్ ఫైండర్ అని ఉంది.అందులో మొక్క వి  కొన్ని లక్షణాలు (ఫీచర్స్)ఇస్తే  పేరు తెల్సుకోవచ్చు. అలా పేరు తెలుసుకున్నాను 😊   







Tuesday, 8 May 2018

పైనాపిల్ లిల్లీ

,






ఈ ఫోటో లో ఉన్నవి చూడటానికి పైనాపిల్ లాగా ఉన్నా అవి పైనాపిల్ కాదు. ఇవి అచ్చు పైనాపిల్ లా ఉన్న పూలు.ఈ పూలను చూడగానే పైనాపిల్ లా ఉన్నాయి కానీ ఇంత చిన్నగా,కొమ్మ అంత బారుగా ఉండి ఇలా ఉండవే అనుకున్నాను.అక్కడ ఉన్న తోటమాలిని అడిగితే,పైనాపిల్ కాదు ఆర్నమెంటల్ ప్లాంట్ అని చెప్పాడు. ఈ మొక్క గురించి ఇంకా వివరాలు తెలుసుకోవాలనుకుంటేఇక్కడ  చూడొచ్చు .





Sunday, 22 April 2018

ఏం తినాలి ? 2







సౌత్ బీచ్ డైట్ : ఈ డైట్ ను Dr.Agatston (హృద్రోగ నిపుణులు)Marie Almon (పోషకాహార నిపుణులు) రూపొందించారు.ఈ డైట్ ముఖ్యం గా ఇన్సులిన్ లెవెల్స్ ని తగ్గించటం మీద దృష్టి పెట్టబడింది.అమెరికన్ హార్ట్ అసోసియేషన్ సమర్ధించిన " లో ఫాట్ - హై కార్బ్ " డైట్ పట్ల అసంతృప్తి/ నిరాశ చెందిన  Dr.Agatston 1990 లో ఈ డైట్ ను రూపొందించారు. 
ఈ డైట్ లో మూడు దశలు ఉంటాయి 
మొదటి దశలో చాలా వేగం గా బరువు తగ్గుతారు. ఇది 2 వారాలు చెయ్యాల్సి ఉంటుంది
తినదగిన ఆహార పదార్ధాలు - అన్ని రకాల మాంసాహారం,గుడ్లు,నట్స్, కూరగాయలు,సోయా పన్నీరు. 
బ్రెడ్,వరిఅన్నం,బంగాళాదుంపలు,పాస్తా,తీపిపదార్ధాలు,పళ్ళు,మద్యం తీసుకోకూడదు. 

రెండో దశ లో ... ఎంత బరువు తగ్గాలి అనుకుంటారో అది సాధించేవరకు పాటించాలి.ఈ దశ లో  నెమ్మది గా  ఒక్కో పిండి పదార్ధాన్ని ఆహారం లో చేర్చుకుంటు ఉండాలి.శరీరంలో ఏమయినా మార్పులు ఉంటే గమనించి, ఒకవేళ పిండి పదార్ధాలు సరిపడకపోతే మళ్ళీ కొన్నాళ్ళు మొదటి దశ ను పాటించి రెండో దశకు రావాల్సి ఉంటుంది. అనుకున్న బరువు చేరుకున్నాక మూడో దశ ... ఈ దశ లో అన్ని రకాల ఆహార పదార్ధాలు మితం గా తీసుకుంటూ బరువు పెరగకుండా , తగ్గకుండా చూసుకోవాలి  


రా(పచ్చి /ముడి ఆహారం) ఫుడ్ డైట్ : పేరు తోనే తెలిసిపోతుంది కదా,  ఏమి తినాలో !
పళ్ళు,పచ్చికూరగాయలు,మొలకలు,ఎండు(డ్రైడ్)పళ్ళు(బాదాం,పిస్తా,జీడిపప్పు,etc.,)గుడ్లు,చేపలు... 

వండిన లేదా ప్రాసెస్డ్ ఆహరం ,రీఫైన్డ్ నూనె ,పంచదార,ఉప్పు,కాఫీ,టీ ,మద్యం ... తీసుకోకూడనివి  




మెడిటరేనియన్ డైట్ :ఈ డైట్ వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి అన్నది ఇంకా పరిశోధన చెయ్యాల్సి ఉంది.ఈ డైట్లో ఎక్కువగా కూరగాయలు ,పళ్ళు,నట్స్,మాంసాహారం మితం గా తీసుకోవచ్చు.వంటల్లో ఆలివ్ నూనె ,అవకాడో నూనె వాడాలి.స్వీట్స్ కూడా మితం గా తినొచ్చు.

ఇంకా చాలా రకాల డైట్ లు ఉన్నాయి కానీ అవన్నీ ఇక్కడ నేను ప్రస్తావించటం లేదు. ఇప్పటి వరకు చూసిన డైట్స్ లో కామన్ గా ఉన్నది ఏంటంటే ... ప్రాసెస్డ్ ఫుడ్స్ తినకూడదు. తాజా కూరగాయలు ,పళ్ళు తినాలి. ఖచ్చితంగా ఫలానా డైట్ అనుసరించాలి అని కాకుండా మన శరీరానికి ఏది సరిపడుతుందో అది తింటే  మంచిది. ప్రతి ఒక్క డైట్ తోనూ లాభాలు ఉన్నాయి,నష్టాలు ఉన్నాయి.పిండి పదార్ధాలు తక్కువ తీసుకుని కొవ్వు పదార్ధాలు ఎక్కువ తీసుకున్నా ,లేదా ఇవి రెండు తగ్గించి ప్రోటీన్ ఎక్కువ తీసుకున్నా...ఏదైనా ప్రమాదమే ! అతి సర్వత్రా వర్జయేత్ అన్నారు పెద్దలు.


కావున ఏ డైట్ ఫాలో అవ్వాలి అని ఎక్కువ ఆలోచించకుండా ,ప్రాసెస్డ్ ఫుడ్స్,ప్యాక్డ్ ఫుడ్స్ మానేసి పిండి పదార్ధాలు,కొవ్వు,ప్రోటీన్ సమతులంగా ఉన్న తాజా ఆహారం తీసుకుంటే సరిపోతుంది.



Thursday, 8 February 2018

ఏం తినాలి ? 1





Zone diet :  Dr. Barry Sears ఈ డైట్ ని డిజైన్ చేశారు. ఈ డైట్ లో కూడా పిండి పదార్ధాలు తక్కువ తీసుకోవాలి.


పిండి పదార్ధాలు,కొవ్వు పదార్ధాలు,ప్రోటీన్ 40:30:30 రేషియో లో తీసుకోవాలి.
4 నుంచి ఆరు గంటల గ్యాప్ తో ఆహారం తీసుకోవాలి. 
ప్రొద్దున్నే నిద్ర లేచిన గంట లోపు అల్పాహారం(low fat protein) తీసుకోవాలి.ఆ తర్వాత రెండు గంటలకు,లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఆహార పదార్ధాలు ( కూరగాయలు, పళ్ళు) తీసుకోవచ్చు.రోజు మొత్తం లో 2 లీటర్ల నీళ్లు తాగాలి.3 మీల్స్,2 స్నాక్స్ తీసుకోవాలి.ప్రతి మీల్ ,స్నాక్ లో ప్రోటీన్ ఉండేలా చూసుకోవాలి.  




కీటోజెనిక్ డైట్ : ఇది ఇంచుమించు అట్కిన్స్ డైట్ లాంటిదే.పిండి పదార్ధాలు తగ్గించి, కొవ్వు పదార్ధాలు ఎక్కువ తీసుకోవటం.ఈ రకమైన డైట్ వలన కీటోన్స్ రిలీజ్ అవుతాయని చెప్పుకున్నాము కదా.ఈ కీటోన్స్ ఎక్కువ మొత్తం లో ఏర్పడితే శరీరానికి హానికరం.
ఉపయోగాలు:తాత్కాలికంగా బరువు తగ్గటం,మంచి కొలెస్ట్రాల్ పెరగటం,డయాబెటిస్ కంట్రోల్. 
ఈ డైట్ ను దీర్ఘకాలికం పాటించటం వల్ల పెద్ద ఉపయోగం ఏమి లేదు. 
అమెరికన్ హార్ట్ అసోసియేషన్,అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ & ఒబేసిటీ సొసైటీ-
కీటోజెనిక్ డైట్( లో కార్బోహైడ్రేట్ డైట్)  గుండెకు మంచిదని చెప్పటానికి తగినన్ని ఆధారాలు లేవు అని పేర్కొన్నాయి.

వెజిటేరియన్ డైట్ : ఇందులో మళ్ళీ రకరకాల డైట్స్ 

లాక్టో -ఒవో వెజిటేరియన్స్ -  అన్ని రకాల మాంసాహార పదార్ధాలు తినరు 

Pescatarians - చేపలు తింటారు , ఇతర మాంసాహారం తినరు 

లాక్టో  వెజిటేరియన్స్ - పాలు,పాల నుంచి తయారయ్యే ఇతర ఆహార పదార్ధాలు తింటారు. గుడ్లు తినరు 

ఒవో వెజిటేరియన్స్ - పాలు,పాల నుంచి తయారయ్యే ఇతర ఆహార పదార్ధాలు  తినరు. గుడ్లు  తింటారు.

వేగన్స్ - జంతువులకు  సంబంధించిన ఎటువంటి ఆహార పదార్ధాలు , తేనెతో  సహా తినరు. 

మాంసాహారం తీసుకునే వారికంటే శాఖాహారులు బరువు తక్కువ గా ఉన్నారని నిరూపణ అయ్యింది.శాఖాహారం తీసుకోవటం వలన క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువని పరిశోధనలు తెలియచేస్తున్నాయి.చెడు కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా తగ్గుతాయి. 

వెజిటేరియన్ డైట్ పాటించటం వలన విటమిన్ డి ,బి 12,ఇనుము, కాల్షియం,జింక్ లోపాలు వచ్చే అవకాశం ఉంది.శాఖాహారం తీసుకుంటే ఆరోగ్యం గ్యారంటీ అనలేము.ఎటువంటి డైట్ ఫాలో అయినా, జంక్ ఫుడ్,రీఫైన్డ్ ఫుడ్స్, ఎక్కువ కాలరీలున్న ఫుడ్స్ తింటే అనారోగ్యం మన వెన్నంటే ఉంటుంది.  

నెక్స్ట్ పోస్ట్ లో ఇంకొన్ని డైట్స్ ... 






Sunday, 4 February 2018

ఏం తినాలి ?






ఒకప్పటి కాలం లో తిండి మీద ఇప్పుడున్నంత  ధ్యాస ఉండేది కాదేమో. ఈ మధ్య కాలం లో తరచూ డైట్ అనే మాట వింటూ ఉన్నాము.లావు తగ్గాలా? అయితే ఈ డైట్ ఫాలో అవ్వండి.కొలస్ట్రాల్ తగ్గాలా ...ఈ డైట్ ఫాలో అవ్వండి.ఆరోగ్యకరమైన జీవితానికి ... ఈ డైట్ ఫాలో అవ్వండి.మెడిటరేనియన్ డైట్ ఫాలో అయితే షుగర్ కంట్రోల్ అవుతుంది ... వగైరా  వగైరా.

బాగా పాపులర్ అయినా డైట్స్ కొన్ని ...

అట్కిన్స్ డైట్

ఈ డైట్ లో ఫాట్ ,ప్రోటీన్ ఫుడ్స్ ఎంతైనా తినొచ్చు. కార్బోహైడ్రేట్స్ చాలా తక్కువ తీసుకోవాలి. ఈ డైట్ ని ,హృద్రోగ నిపుణులు డా. అట్కిన్స్ డిజైన్ చేశారు.

ఈ డైట్ లో 4 దశ లు   ఉన్నాయి
మొదటి దశలో రోజుకి 20గ్రాముల కార్బోహైడ్రేట్స్ మాత్రమే తీసుకోవాలి.అది కూడా ఆకుకూరలు, కూరగాయల ద్వారా లభించేవి మాత్రమే.
రెండో దశ లో  పీచు పదార్ధాలు ఎక్కువ ఉన్న ఫుడ్స్   - నట్స్ , తక్కువ పరిణామం లో పండ్లు
వీటిని మొదటి వారం లో 25 గ్రాములు , రెండవ వారం లో 30 గ్రాముల చొప్పున తీసుకుంటూ ఉండాలి.బరువు తగ్గటం ఆగిపోయేవరకు అలా తీసుకుంటూ,బరువు తగ్గటం ఆగి పోయాక మళ్ళీ బరువు తగ్గటం మొదలయ్యేవరకు రోజుకు 5 గ్రాములు పిండి పదార్ధాలు తగ్గించుకుంటూ ఉండాలి.  
మూడో దశ లో రోజుకు ఒక 10గ్రాములు పిండిపదార్ధాలు ఎక్కువ తీసుకుంటూ ఉండాలి
నాలుగో దశ -  జీవిత కాల నిర్వహణ  

తినదగిన ,తినకూడని ఆహార పదార్ధాలు

అన్ని రకాల నాన్ వెజ్ ఫుడ్స్,కోడిగుడ్లు ,బ్రోకలీ, ఆకుకూరలు,నట్స్  ,ఆలివ్ నూనె ,కొబ్బరి నూనె ,కాఫీ , గ్రీన్ టీ   తీసుకోవచ్చు

పంచదార , తీపి పదార్ధాలు ,శనగలు,చిక్కుళ్లు ,లెగ్యుమ్ జాతికి చెందినవి ఏవి తీసుకోకూడదు.
మొదటి దశలో అరటి పళ్ళు,యాపిల్స్ ,ద్రాక్ష పళ్ళు తినకూడదు.

ఈ డైట్   ఎంతవరకు సఫలమయ్యింది ?

ఈ డైట్ అనుసరించిన వారు బరువు తగ్గటం సాధించొచ్చు కానీ,ఎక్కువ మంది మధ్యలోనే వదిలెయ్యటం జరుగుతుంది.స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు గమనించిన   విషయం ... బ్లడ్ ప్రెషర్ ,కొలెస్ట్రాల్ లెవెల్స్,బరువు తగ్గటం , మిగతా డైట్స్ తో పోలిస్తే అట్కిన్స్ డైట్ మెరుగ్గా ఉందని.దీనిని నిర్ధారించటానికి ఇంకా పరిశోధనలు చెయ్యాల్సి ఉంది.
ఈ డైట్ ఫాలో అయ్యే మొదటి రోజుల్లో తలనొప్పి,మైకం,నిస్త్రాణం,మలబద్ధకం లాంటి కొన్ని దుష్ప్రభావాలు  గమనించారు. పిండిపదార్ధాలు తక్కువ తీసుకోవటం వలన,శక్తి కోసం  శరీరం లోని కొవ్వు పదార్ధాలు ఉపయోగించినందువల్ల కీటోన్స్ ఏర్పడుతాయి.కీటోన్స్ ప్రభావమే ..  దుష్ప్రభావాలు
షుగర్ వ్యాధి ,కిడ్నీ వ్యాధి ఉన్నవారు,గర్భిణీ స్త్రీలు,పాలిచ్చే తల్లులు ఈ డైట్ ను అనుసరించ కూడదు .


నెక్స్ట్ పోస్ట్ లో ఇంకో డైట్ గురించి

సౌజన్యం : medicalnewstoday