Thursday, 6 December 2012

నీ స్నేహం



ఎడారి లో మరీచిక లా 
ఉక్కపోత లో సమీరం లా  
చైత్రం లో చిరుజల్లు లా  
నైరాశ్యం లో ఆశ  లా 
చీకటి లో చిరుదివ్వెలా 
నీ స్నేహం 



Wednesday, 14 November 2012

ఊహలు




 

ఊహలు అందంగా ఉంటాయి,ఆహ్లాదాన్ని ఇస్తాయి.
ఊహలు  కి ఎల్లలు లేవు 
టైం మెషీన్ సహాయం లేకుండానే భవిష్యత్తు  లోకి వెళ్ళొచ్చు.
వాస్తవం లో సాధించలేని వాటిని ఎన్నిటినో ఊహల్లో సాధించొచ్చు 
ఊహలు  నిస్తేజ జీవితం లో ఉత్తేజాన్నిస్తాయి 


ఇది చదివినాక రాసిన వారిని మర్డర్ చేయాలనిపించినా ఊహల్లో సాధ్యమే! 

Tuesday, 30 October 2012

మనమింతే!


ఏమిటో ఈ వింత ?
పిచ్చి అనే ముద్ర వేసి 
కుక్కలను చంపుతాము.
అదే పిచ్చి అనే ముద్రతో నేరస్తులను
 శిక్ష పడకుండా కాపాడుతాము 
వింత కాదు,మనమింతే! 



Saturday, 27 October 2012

మేమే మనుషులం.

 
 
కత్తులతో లేదా మాటలతో రోజూ కొందర్ని చంపేస్తూ ఉంటాము
శాడిజం , క్రూరత్వానికి  చిరునామా మేమే!
కళ్ళు తెరవని పసికూనల్ని అయినా కాటికి కాళ్ళు చాపుకున్న ముదుసలి అయినా
ఏ మాత్రం కనికరం లేకుండా ...
డబ్బే మాకు ప్రధానం.
గోముఖ వ్యాఘ్రాలం ,మేమే మనుషులం.

Thursday, 11 October 2012

రామలింగేశ్వర ఆలయం - కీసరగుట్ట

రావణుని సంహరించిన తరువాత, బ్రాహ్మణ హత్యా పాపాన్ని పోగొట్టుకునేందుకు శ్రీరాముడు శివలింగాన్ని ప్రతిష్టించదలుచుకుని,హనుమంతుడుని కాశీ నుంచి శివలింగాన్ని తీసుకు రావలసిందిగా కోరారు. విగ్రహాన్ని ప్రతిష్టించాల్సిన సమయం దాటిపోతున్నా హనుమంతుని జాడ లేదు.అప్పుడు ఆ పరమశివుడే స్వయం ప్రకటితమై శ్రీరామునికి,శివలింగాన్ని ప్రతిష్టించటానికి ఇచ్చారంట.ప్రతిష్టించటం పూర్తి అయిన తరువాత ఆంజనేయ స్వామి వారు 101 శివలింగాలతో వచ్చారంట. తాను వచ్చేటప్పటికే శివలింగం ప్రతిష్టమవటంతో కోపంతో తాను తెచ్చిన శివలింగాలను విసిరి వేసారంట. ఇప్పటికి గుడి చుట్టుపక్కల ప్రాంతంలో ఆ శివలింగాలు మనకు కనిపిస్తాయి.కీసరగుట్ట మీద శివాలయంతో పాటు ఆంజనేయస్వామి ఆలయం కూడా ఉంది.









 ఆంజనేయ స్వామి వారిచే విసిరి వేయబడ్డ శివలింగాలు ఈ క్రింది పిక్స్ లో చూడొచ్చు 







గుడిలో వానర సంచారమూ ఎక్కువే !



Tuesday, 9 October 2012

చురుక్కు-చమక్కు


కలికాలం ,ఈ కాలం పిల్లలు అస్సలు పెద్దల మాట వినటం లేదు .పెద్దల మాట చద్ది మూట అన్నారు ...మనం ఎలా ఉండేవాళ్ళం ?

ఇప్పుడు డాక్టర్లు అన్నీ వేడి ,వేడిగా వండిన వెంటనే తినాలని చెపుతున్నారు గా ,అందుకని చద్దిమూటను లెక్క చెయ్యటం లేదులేరా.


ఏమిటి నోరు అలా వెళ్ళ బెట్టావ్?పూర్తిగా కాకపోయినా ,కొద్దో గొప్పో పాటిస్తున్నారు లేరా .దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోమని పెద్దలు చెప్పారు.ఆ మాటను ఎంత చక్కగా పాటిస్తున్నారు.తామో ,లేదా తమ బంధువులో పదవిలో ఉండగానే నాలుగు రాళ్ళు కాదు నాలుగు వేల రాళ్ళు వెనకేసుకుంటున్నారు



Wednesday, 3 October 2012

స్వార్ధం




జన్మలన్నిటి లోకి మానవజన్మ ఉత్తమమైనదని మన ముందు తరాల వారు సెలవిచ్చారు.
కాకిపిల్ల కాకికి ముద్దు అనే సామెత ఎలాగు ఉండనే ఉంది.మరి మన జన్మని మనం పొగుడుకోపోతే ఇంకెవరు పొగుడుతారు చెప్పండి.అసలే ఇతర జీవాలకు మాటలు రావాయే.ఇతరలుకు సాయపడినప్పుడే మన జన్మకు సార్ధకం అని కూడా చెప్పారు.అబ్బా !అలా చాలానే చెప్పారు లేమ్మా ! చెప్పినవన్నీ తు.చ. తప్పక పాటించాలంటే ఎంత కష్టం.అర్ధం చేసుకోరూ !
నాకు మాత్రం, ఏమిటో  ఏ జీవికి లేనంత స్వార్ధం ఒక్క మనిషి కి మాత్రమే ఉందనిపిస్తుంది.సృష్టి లో ఉన్న ప్రతి జీవి ప్రతిఫలాపేక్ష లేకుండా ఏదో విధంగా మనకు ఉపయోగపడుతుంది. కాని , మనం ఆ విధంగా ప్రతిఫలాన్ని ఆశించకుండా ఎవరికన్నా సహాయం చేస్తామా?
చాలు చాల్లేవమ్మా పెద్ద చెప్పొచ్చావ్,ప్రతి ఒక్కళ్ళు అడగకుండా సలహాలు,నీతులు చెప్పమంటే చెప్తారు.నువ్వు మాత్రం ఎమన్నా చేస్తావ?
అదే మరి, నేను చేస్తానని చెప్పటం లేదు.మనిషి నైజం గురించి చెపుతున్నాను.
అది నువ్వు చెప్పాలా ?మాకు తెలియదా?
ఎందుకు తెలియదు?తెలుసు .అందుకనే పైన ఆ బొమ్మ పెట్టింది.ఎవరికి తెలియదని కాదు.ఎవరో వింటారని కాదు.నేను చెప్పేవి విని అర్జంట్ గా మారి పోతారని కాదు.నాకు చెప్పాలనిపించింది.అందుకని నా బ్లాగ్ లో రాసుకుంటున్నాను.
హ హ హ !సరే ఇంకా ఏమి చెప్పాలనుకుంటున్నావు?
స్వార్ధాన్ని పూర్తిగా కాకపోయినా  కొంచం  అయినా తగ్గించుకోమంటున్నాను 
ఏ ప్రతిఫలం ఆశించకుండా చెట్లు  మనకు పూలు,పళ్ళు ఇస్తున్నాయి.
ఆ ఆ ఇస్తున్నాయి.వాటికి నీరు పోసి పెంచుతుంటేనే ఇస్తున్నాయి. 
మన స్వార్ధం కోసం ఇతర జీవాల్ని ఈ లోకంలోనే లేకుండా చేయొద్దు అంటున్నాను.
ఇది మరీ బాగుంది.ఇక మనకు వేరే పనులేమీ లేవా ఏమిటి?ఇతర జీవాల్ని చంపటమే పనా?
హ్మ్ !ఇక చెప్పేదేమీ లేదులే,మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడుకుందాము.