జన్మలన్నిటి లోకి మానవజన్మ ఉత్తమమైనదని మన ముందు తరాల వారు సెలవిచ్చారు.
కాకిపిల్ల కాకికి ముద్దు అనే సామెత ఎలాగు ఉండనే ఉంది.మరి మన జన్మని మనం పొగుడుకోపోతే ఇంకెవరు పొగుడుతారు చెప్పండి.అసలే ఇతర జీవాలకు మాటలు రావాయే.ఇతరలుకు సాయపడినప్పుడే మన జన్మకు సార్ధకం అని కూడా చెప్పారు.అబ్బా !అలా చాలానే చెప్పారు లేమ్మా ! చెప్పినవన్నీ తు.చ. తప్పక పాటించాలంటే ఎంత కష్టం.అర్ధం చేసుకోరూ !
నాకు మాత్రం, ఏమిటో ఏ జీవికి లేనంత స్వార్ధం ఒక్క మనిషి కి మాత్రమే ఉందనిపిస్తుంది.సృష్టి లో ఉన్న ప్రతి జీవి ప్రతిఫలాపేక్ష లేకుండా ఏదో విధంగా మనకు ఉపయోగపడుతుంది. కాని , మనం ఆ విధంగా ప్రతిఫలాన్ని ఆశించకుండా ఎవరికన్నా సహాయం చేస్తామా?
చాలు చాల్లేవమ్మా పెద్ద చెప్పొచ్చావ్,ప్రతి ఒక్కళ్ళు అడగకుండా సలహాలు,నీతులు చెప్పమంటే చెప్తారు.నువ్వు మాత్రం ఎమన్నా చేస్తావ?
అదే మరి, నేను చేస్తానని చెప్పటం లేదు.మనిషి నైజం గురించి చెపుతున్నాను.
అది నువ్వు చెప్పాలా ?మాకు తెలియదా?
ఎందుకు తెలియదు?తెలుసు .అందుకనే పైన ఆ బొమ్మ పెట్టింది.ఎవరికి తెలియదని కాదు.ఎవరో వింటారని కాదు.నేను చెప్పేవి విని అర్జంట్ గా మారి పోతారని కాదు.నాకు చెప్పాలనిపించింది.అందుకని నా బ్లాగ్ లో రాసుకుంటున్నాను.
హ హ హ !సరే ఇంకా ఏమి చెప్పాలనుకుంటున్నావు?
స్వార్ధాన్ని పూర్తిగా కాకపోయినా కొంచం అయినా తగ్గించుకోమంటున్నాను
ఏ ప్రతిఫలం ఆశించకుండా చెట్లు మనకు పూలు,పళ్ళు ఇస్తున్నాయి.
ఆ ఆ ఇస్తున్నాయి.వాటికి నీరు పోసి పెంచుతుంటేనే ఇస్తున్నాయి.
మన స్వార్ధం కోసం ఇతర జీవాల్ని ఈ లోకంలోనే లేకుండా చేయొద్దు అంటున్నాను.
ఇది మరీ బాగుంది.ఇక మనకు వేరే పనులేమీ లేవా ఏమిటి?ఇతర జీవాల్ని చంపటమే పనా?
హ్మ్ !ఇక చెప్పేదేమీ లేదులే,మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడుకుందాము.
4 comments:
మనిషి ప్రస్తుతం యాంత్రిక జీవనానికి అలవాటు పడిపోయాడండి. నేనూ నా వాళ్ళు తప్ప వేరే వాళ్ళ గురించి ఆలోచించటమే మానేశాడు. ఒకప్పుడు పల్లెటూళ్లలో పరిస్థితి ప్రస్తుత పరిస్థితే అందుకు నిదర్శనం.
మీ అభిప్రాయాన్ని తెలియచేసినందుకు ధన్యవాదాలు శ్రీనివాస రావు గారు.సాటి మనుషుల పట్ల మనం ప్రవర్తించే తీరే కాదండి.ప్రత్యక్షంగా, పరోక్షంగా పర్యావరణానికి మనం చేస్తున్న హాని ఇంతా అంతా కాదు.
వింటారో లేదో.మనం చెప్పటమే.బ్లాగ్ లు అందుకే కదా.
మన లాంటి వాళ్ళు ఉంటారు ఈ ప్రపంచం లో...మంచి భావాలు
అవును శశి గారు,విన్నా వినకపోయినా చెపుతూ ఉండాల్సిందే!
మీ అభిప్రాయాన్ని తెలియచేసినందుకు ధన్యవాదాలు. :)
Post a Comment