ట్రాన్స్ లేటర్ అవతారం
ట్యూషన్ లో ఒకరకం కష్టాలు అయితే ,స్కూల్లో ఇంకోరకం కష్టాలు.అంతకు ముందు చదివినది పల్లెటూళ్ళో,ప్రభుత్వ పాటశాల లో. పాఠం చెప్పిన తర్వాత టెక్స్ట్ బుక్ లో ప్రశ్నలకు జవాబులు మార్క్ చేసుకుని నోట్స్ లో రాసుకునే వాళ్ళం.అదే హోంవర్క్.ఒక్క లెక్కలకు తప్పించి మిగతా సబ్జెక్ట్స్ కి ప్రత్యేకించి వేరే హోంవర్క్ ఏమీ ఉండేది కాదు.
ఇక ఇప్పటి విషయానికి వస్తే ,ప్రతి సబ్జెక్ట్ కి ఒక క్లాస్ నోట్ బుక్ ,హోంవర్క్ కి ఒకటి,వీక్లీ టెస్ట్ కి ఒకటి,మంత్లీ టెస్ట్ కి ఒకటి , అలా ఒక్కో సబ్జెక్ట్ కి నాలుగు నోట్ బుక్స్.కాకపోతే ఇప్పటి పిల్లల్లా అన్నీ మోసుకెళ్ళే బాధ లేదు.టెస్ట్ నోట్స్ అన్నీ,క్లాస్ లోనే ఉన్న అలమర లో ఉంచేవాళ్ళు.వాటి బాధ్యత క్లాస్ లీడర్ ది.కీస్ తన దగ్గర ఉండేవి.టెస్ట్ ఉన్న రోజు బుక్స్ తీసి ఎవరివి వాళ్లకు ఇచ్చేది.ఇక టెక్స్ట్ బుక్స్,వేరే నోట్ బుక్స్ అవసరమైనవి మాత్రమే ఇంటికి తీసుకెళ్ళేవాళ్ళం.మిగతావి డెస్క్ లో పెట్టి లాక్ చేసుకునే వాళ్ళం.అతి పెద్ద ప్రాబ్లం నోట్స్ డిక్టేట్ చెయ్యడం.ప్రత్యేకించి సోషల్ &ఇంగ్లిష్ .ఆవిడ ఏమి చెప్తుందో అర్ధమయ్యేది కాదు.పైగా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ స్పీడ్ లో.(మలయాళీ లు మాట్లాడుతున్నప్పుడు విన్నారా?అలా అన్నమాట :) )క్రొత్తలో ఏమీ రాసుకోలేక ఏడ్చేసేదాన్ని.నెమ్మదిగా ఇంప్రూవ్ అయ్యాను.మాథ్స్,సైన్స్,తెలుగు - ఇబ్బంది లేని సబ్జెక్ట్స్.ఇక హిందీ.పిల్లల గొంతు వినిపించని క్లాస్ ఏదన్నా ఉందంటే అది ఇదే ! ఆ క్లాస్ లో హిందీ తప్పించి వేరే బాష లో మాట్లాడితే 10 పైసలు ఫైన్.అందుకని టీచర్ అడిగిన దానికి జవాబు చెప్పటానికి తప్పించి ఎవరూ నోరు తెరిచేవాళ్ళు కాదు.
సరే,ఇక ట్యూషన్ లో పెద్ద కష్టం వచ్చిందన్నాను కదా ! అదేమిటంటే ...
ట్యూషన్ లోచేరిన ఒక నాలుగు నెలలకు అనుకుంటా,వారానికి ఒకసారి - మంగళవారం క్రైస్తవ ప్రచారకులు వచ్చేవాళ్ళు.ఒక గంటన్నర పాటు,బైబిల్ లో కొన్ని వాక్యాలు చదివి చెప్పేవాళ్ళు.వాటి తో పాటు కొన్ని పిట్టకథలు.ఆ తర్వాత క్రైస్తవ భక్తి గీతాలు పాడించేవాళ్ళు.ఆ చెప్పేవాళ్లకు తెలుగు రానందున వెంట ఒక ట్రాన్స్లేటర్ ని కూడా తీసుకుని వచ్చేవాళ్ళు.ఒకరోజు ఆ ట్రాన్స్లేటర్ ఒకటి తప్పు చెప్పటం తో నేను,విని ఊరుకోకుండా ,దాని అర్ధం అది కాదు అని సరిదిద్దాను.అంతే !నువ్వు బాగా చెప్తున్నావు,ఇక నుంచి తెలుగు లో నువ్వే చెప్పు అని ట్రాన్స్లేషన్ బాధ్యత నాకిచ్చేసారు.అది తప్పు చెప్పారు కనుక సరిచేసాను,మొత్తం చెప్పాలంటే నాకు రాదు అన్నా వినలేదు.గుంపు లో కూర్చుంటే,పూర్తిగా విన్నా వినకపోయినా సమస్య లేదు.కాని ట్రాన్స్లేషన్ చెయ్యాలంటే చచ్చినట్టు శ్రద్ధగా అంతా వినాల్సిందే!తప్పించుకునే మార్గం లేకపోయింది :(
ఆ తర్వాత భక్తి గీతాలు పాడేటప్పుడు " మేరా మన్ మే హై ఈసా,తన్ మే హై ఈసా" అని పాడిస్తున్నారు.నేనేమో మేరా మన్ మే హై రామ్ ,తన్ మే హై రామ్ అని పాడుతున్నాను.టీచర్ ఎప్పుడు వచ్చారో తెలియదు,నీకెంత పొగరు అని నెత్తి మీద మొట్టారు.హోం వర్క్ చెయ్యలేదనో,మార్క్స్ తక్కువ వచ్చాయనో ఎప్పుడూ తన్నులు తినలేదు కానీ,ఇలాంటి వాటికి అప్పుడప్పుడు చీవాట్లు తినేదాన్ని.
తర్వాత కొన్నిరోజులకు నాకు బైబిల్ కొని ఇచ్చారు.ఒక ఆదివారం హెబ్రోన్ కి తీసుకువెళ్ళారు.ప్రవచనాలు పూర్తయ్యాక,ఈ వారం ఏ తప్పు(సినిమాలు చూడకపోవటం,సినిమా పాటలు వినకపోవడం,మత గ్రంధాలు తప్పించి వేరే పుస్తకాలు చదవక పోవటం ,అబద్దాలు చెప్పకపోవటం etc ) చెయ్యని వాళ్ళు చేతులు ఎత్తమన్నారు.చాలా కొద్దిమంది చేతులు ఎత్తారు.అలా చేతులు ఎత్తిన వారికి చిన్న బ్రెడ్ ముక్క నోట్లో వేసి కొంచం వైన్ పోశారు.కొంతమంది కన్ఫెషన్ రూం అని ఉంది,అక్కడకు వెళ్లి కన్ఫెసర్ కి తమ తప్పులను చెప్పుకున్నారు.ఆ తర్వాత సాంబార్ అన్నం తిని ఇంటికి వచ్చేసాము.
నాకు అప్పుడప్పుడు మతం మార్చుకోవాలని అనిపించినా ఎక్కడో చిన్న హెజిటేషన్.అందుకనే మతం మారలేదు :)

No comments:
Post a Comment