ఎక్కువ నచ్చినవి / ఇష్టమైనవి
స్కూల్ కి వెళ్ళేప్పుడు ముందుగా ఏ బస్ వస్తే ఆ బస్ ఎక్కినా ,తిరిగి వచ్చేప్పుడు మాత్రం డబల్ డెక్కర్ బస్ కోసం
వేచి ఉండేవాళ్ళం.స్కూల్ కి ఇంటికి మధ్య దారి పొడుగూ మోదుగుపూల చెట్లు ఉండేవి.ఆ పూలు కోసుకోవాలంటే మామూలుగా అందవు కాబట్టి డబల్ డెక్కర్ బస్ ఎక్కితే ఆ పూలు కోసుకోవచ్చు అని ఆ బస్ కోసం వేచి ఉండేవాళ్ళమన్నమాట.ఇప్పుడు ఆ దారిలో అసలు చెట్టన్నదే లేకుండా పోయింది. :(
వేసవి లో తర్బూజా తిని, గింజల్ని ఎండబెట్టి ఉంచేవాళ్ళం.హావలాక్ లైన్స్ (ఆర్మీ క్వార్టర్స్ ) చివరికి వెళ్ళితే పెద్ద పెద్ద కొండరాళ్ళు ఉండేవి.అప్పుడప్పుడు సాయంకాలం,ఆ ఎండబెట్టిన గింజల్ని తీసుకుని ఆ కొండరాళ్ళ దగ్గరకు వెళ్ళేవాళ్ళం.ఆ రాళ్ళ పైకి ఎక్కితే బేగంపేట్ విమానాశ్రయం చాలా చక్కగా కనిపించేది.ఇప్పుడు రాక్ క్లైంబింగ్ అనే పేరు తో మీట్ అప్ లు నిర్వహిస్తున్నారు కాని అప్పట్లో అలాంటివి ఏమి లేవు.ఆ రాళ్ళు ఎక్కి కూర్చుని తర్బూజా గింజల్ని వలుచుకుతింటూ సూర్యాస్తమయాన్ని చూడటం ,అలానే టేకాఫ్ మరియు లాండ్ అవుతున్న విమానాల్ని చూడటం ఎంతో ఇష్టం మరియు ఆనందం.
ఇంకో ఇష్టమైన విషయం డబల్ డెక్కర్ బస్ .
స్కూల్ కి వెళ్ళేప్పుడు ముందుగా ఏ బస్ వస్తే ఆ బస్ ఎక్కినా ,తిరిగి వచ్చేప్పుడు మాత్రం డబల్ డెక్కర్ బస్ కోసం
వేచి ఉండేవాళ్ళం.స్కూల్ కి ఇంటికి మధ్య దారి పొడుగూ మోదుగుపూల చెట్లు ఉండేవి.ఆ పూలు కోసుకోవాలంటే మామూలుగా అందవు కాబట్టి డబల్ డెక్కర్ బస్ ఎక్కితే ఆ పూలు కోసుకోవచ్చు అని ఆ బస్ కోసం వేచి ఉండేవాళ్ళమన్నమాట.ఇప్పుడు ఆ దారిలో అసలు చెట్టన్నదే లేకుండా పోయింది. :(
4 comments:
> ఇప్పుడు ఆ దారిలో అసలు చెట్టన్నదే లేకుండా పోయింది.
ఇలా ప్రగతి సాధిస్తూపోతే ఒకనాటికి ఈ భూమిమీద మనిషనే జీవి ఆనవాలు కూడా లేని రోజూ వస్తుంది.
మనుషుల ఆలోచనల్లో ప్రగతి లేకపోయినా మల్టీప్లెక్స్ లు,షాపింగ్ మాల్ లు కట్టటం లో ప్రగతిని బాగానే సాధించాము శ్యామలీయం గారు.
Thank you for commenting !
బాగున్నాయండీ మీ జ్ఞాపకాలు.. కీప్ రైటింగ్.. :)
థాంక్యూ వేణు గారు ! ఇంకా రాయాల్సినవి కొన్ని ఉన్నాయి,వెంటనే రాయటం వీలు కాకపోవచ్చు కానీ, రాస్తాను :)
Post a Comment