తుగ్లక్ పరిపాలన అది ఎలా ఉండేదో తెలియదు .కొంచం వింతగా/పిచ్చి గా ఉన్న వాళ్ళను తుగ్లక్ అని అనటం విన్నాను.దానిని బట్టి తుగ్లక్ పరిపాలన అంటే పిచ్చిగా ఉంటుందని అనుకోవచ్చు అన్నమాట! ప్రస్తుత ప్రభుత్వ పరిపాలన అలానే ఉంది.
ఏ పని జరగాలన్నా ఆధార్ కార్డు తప్పనిసరి, అన్నింటీకీ ఆ ఒక్కటే 'ఆధార'మంటూ అందరూ అంటుంటే,నేను కూడా ఆధార్ కార్డ్ నమోదు కేంద్రానికి వెళ్లాను.అది మా ఇంటి దగ్గర ఉన్న డైట్ కాలేజ్ లోనే ఉంది.తెల్లవారు ఝామున టిఫిన్ క్యారియర్ లతో వచ్చి జనం రోడ్ మీద నుంచుని ఉండేవాళ్ళు.కాలేజ్ గేట్ 10 గంటలకు కాని తెరవరు కదా,ఎందుకు ఇంత ప్రొద్దునే వచ్చి పడిగాపులు కాయటం అనిపించేది వాళ్ళను చూస్తే !సరే,పేరు నమోదు చేయించటానికి మొదటిసారి వెళ్ళినప్పుడు గుమ్మం వరకు చేరేటప్పటికి టైం అయిపోయింది ,రేపు రండి అని చెప్పి పంపించేసారు.మధ్యానం అయితే కొంచం జనం తక్కువ ఉన్నట్లున్నారు అని రెండో రోజు మధ్యానం వెళితే ,ఇప్పుడు ఓన్లీ ప్రెస్ వాళ్లకు మాత్రమే ,రేపు రండి అని సలహా!ఆ విధం గా ఒక నాలుగు రోజులు తిరిగి విసుగొచ్చి కార్డ్ లేకపోతే వచ్చిన నష్టం ఏమీ లేదులే అని ఇక వెళ్ళలేదు.ఆ తర్వాత రెండు నెలలకు,తొందరలో నమోదు కేంద్రాన్ని అక్కడనుంచి తీసివేస్తారని సమాచారం రావటంతో మళ్ళీ తిరుగుడు మొదలు.ఈ సారి ఒక రెండు రోజులు ప్రొద్దున,మధ్యానం తిరిగి ఎలాగయితే పేరు నమోదు చేయించుకోవటం లో విజయం సాధించాను.
ఆ తర్వాత గాస్ సబ్సిడీ కావాలంటే డీలర్ ఆఫీస్ కి వెళ్లి ఆధార్ కార్డ్ నెంబర్ ఇవ్వాలి అంటే అక్కడకు వెళ్ళాను.మాకు ఆధార్ కార్డ్ వచ్చేప్పటికి ఇల్లు మారాము.గాస్ బుక్ లో ఉన్న అడ్రస్ వేరు,ఆధార్ కార్డ్ లో ఉన్న అడ్రస్ వేరు కాబట్టి అడ్రస్ ప్రూఫ్ సబ్మిట్ చెయ్యాలి,అది తీసుకు రండి అని చెప్పటం తో మళ్ళీ ఆ అడ్రస్ ప్రూఫ్ తీసుకువెళ్ళి ఎలా అయితే ఏమి ఆ పని కూడా పూర్తి చేసుకున్నాను.
The AADHAAR number is not recognized as a legal proof of residence due to issues with the data protection.
ఇల్లు మారిన ప్రతిసారీ అడ్రస్ ప్రూఫ్ సబ్మిట్చెయ్యాల్సి వస్తే ఇంక ఆధార్ కార్డ్ ఎందుకో నాకు అర్ధం కాలేదు.సబ్సిడీలు పొందటానికి మాత్రమే ఆధార్ కార్డ్...
నెక్స్ట్ బ్యాంక్ లో ఆధార్ కార్డ్ నెంబర్ లింక్ చెయ్యటం . అది కూడా పూర్తయ్యింది. ఇంతలో ఈ న్యూస్ .
Adhaar Card Not Mandatory for LPG Subsidy'
By Express News Service - BANGALORE
Published: 08th December 2013 07:23 AM
It is not mandatory to display your Aadhaar card to get subsidies for LPG connections, Union Petroleum Minister M Veerappa Moily said. He added gas supply agencies insisted that customers show their Aadhaar card only to identify illegal connections.
By Express News Service - BANGALORE
Published: 08th December 2013 07:23 AM
It is not mandatory to display your Aadhaar card to get subsidies for LPG connections, Union Petroleum Minister M Veerappa Moily said. He added gas supply agencies insisted that customers show their Aadhaar card only to identify illegal connections.
నేను మా ఎదురింటి వాళ్ళింటికి వెళ్ళేప్పటికి ఆవిడ రాలి పడిన ఎండు కొబ్బరికాయలు ఏరి వాటి పీచు తీస్తున్నారు.నేను, ఆధార్ కార్డ్ అవసరం లేదంట అండి న్యూస్ వచ్చింది అనగానే ఆవిడ కోపం తో ఎవరండి చెప్పింది ,నా ఎదురుగా ఉంటే వాళ్ళ తల మీదే ఈ కొబ్బరి కాయను పగలకొడతాను అని అన్నారు.వాళ్ళు లైన్ లో నించోకుండా ,1000 ఇచ్చి (ముగ్గురి పేర్లు )నమోదు చేయించుకున్నారంట. ఎంత డబ్బు వేస్ట్ అండి ఓ బాధ పడిపోయారు . మళ్లీ ఇప్పుడు ఈ న్యూస్ ...
December 13, 2013 13:39 IST
Link your Aadhaar number by January 31 to get LPG subsidy
ఇప్పుడు ఏది నిజమో తెలియదు .
About Rs. 35 billion (Rs.3,500 crore) was spent on Aadhaar program from beginning (January-2009) till September2013 with enrollment of 50 crore persons. It includes operating costs as well as capital expenditure
ఇంత ఖర్చు పెడుతున్నప్పుడు ఎంతో కొంత క్లారిటీ ఉండాలి కదా ?వాళ్లకు లేదు సరే,జనాల్ని కూడా అయోమయం లో పడేస్తున్నారు .
No comments:
Post a Comment