కావలసినవి :
గోధుమ పిండి : 4 గుప్పిళ్ళు లేదా 150 గ్రాములు
మెంతి కూర : ఒక కట్ట
కొత్తిమీర : సగం కట్ట
అల్లం : చిన్న ముక్క
పచ్చిమిర్చి : 2
జీలకర్ర పొడి : పావు స్పూన్
పెరుగు : చిన్న కప్పు
బెల్లం (పొడి చేసినది) : సగం కప్పు
నూనె :రెండు టేబిల్ స్పూన్స్
ఉప్పు : తగినంత
చేసే పద్ధతి :
మెంతి కూర,కొత్తిమీర ఆకులు సన్నగా తరుక్కోవాలి.
పెరుగు లో బెల్లం పొడి వేసి కలుపుకోవాలి.
గోధుమ పిండి లో ఉప్పు,నూనె,అల్లం పచ్చిమిర్చి పేస్ట్ ,మెంతి కొత్తిమీర ఆకులు , జీలకర్ర పొడి వేసి బెల్లం కలిపిన పెరుగు తో కలపాలి.
ఈ పిండిని ముద్దలు గా చేసుకుని ,చపాతీ ల్లా వత్తి పెనం మీద కాల్చుకోవాలి.
ఇది గుజరాతీయులు చేసుకునే రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన వంటకం.
No comments:
Post a Comment