వేల సంఖ్య లో ఖడ్గమృగాలు,ఏనుగులు, వందల సంఖ్యలో అడవిదున్నలు ,జింకలు( Swamp deers) బెంగాల్ రాయల్ టైగర్స్ -106 - పార్క్ లో పెట్టిన బోర్డ్ .
ఖడ్గమృగాలు పర్వాలేదు,ఎక్కువ సంఖ్య లోనే కనిపించాయి.అడవి దున్నలు ఓ నాలుగు,కొన్ని జింకలు ,పక్షులని మాత్రమే చూడగలిగాము.టైగర్స్ 106 అని రాసారు ,కనీసం ఒక్కటన్నా కనిపిస్తుందేమో అనుకుంటే ఒక్కటి కూడా కనిపించలేదు.జంతువులు కనిపించినా ,కనిపించకపోయినా అడవి లో ప్రయాణం ఒక చక్కటి అనుభూతి.పార్క్ కి వెళ్ళే దారి లో టీ తోటలు,వాటి లోనే మిరియపు తీగలు.
ఫోటో దిగే భాగ్యం దీనికి ఒక్క దానికే కలిగింది |
అడవి దున్నల ఫామిలీ
ఎక్కడో దూరాన జింకలు
పక్షులు 5 ,6 రకాలు కనిపించాయి కాని ఫోటోస్ తీయటం కుదరలేదు.ఆకుపచ్చ పసుపు రంగు కలిసిన పావురాలు చాలా అందం గా ఉన్నాయి.నైట్ అక్కడ ఉండి ,తెల్లవారు ఝామున 3 లేదా 4 గంటలకు వెళితే ఎక్కువ జంతువులు కనిపిస్తాయి అని చెప్పారు.మాకు అంత టైం లేకపోవటం తో సాయంత్రానికి తిరిగి వచ్చేసాము.
ఇక్కడ తినటానికి బాంబూ చికెన్ దొరుకుతుంది.ఒకసారి తినొచ్చు ,పర్వాలేదు. ఉప్పు కారాలు ,మసాలాలు ఎక్కువ తినేవారికి నచ్చదేమో !
పార్క్ కి వెళ్ళే దారి లోనే రోడ్ ప్రక్కన చిన్న పాకలు లాగ వేసి కొబ్బరిబొండాలు, బాంబూ పెరుగు(వెదురు బొంగు లో పాలు తోడు పెట్టినది ) అమ్ముతున్నారు. ఈ పిక్ లో ఉన్నది 90 రూపాయలు. టేస్ట్ ఆహా ,ఓహో అనే లా లేదు కాని ఫర్ ఎ చేంజ్ ...