హజో నుంచి తిరిగి వచ్చేప్పుడు దారిలో వసిష్ఠ ఆశ్రమం ,బాలాజీ టెంపుల్,శ్రీమంత శంకరదేవ కళాక్షేత్ర చూసి ఇంటికి వచ్చేసాము.సైన్స్ మ్యూజియం కి వెళ్ళాము ,కానీ అది 4:30 కి మూసి వెయ్యటం వల్ల చూడటానికి వీలు కాలేదు.ఇంకో రోజు వెళ్ళొచ్చు అనుకున్నాము కానీ చూడకుండానే తిరిగి హైదరాబాద్ వచ్చేసాము.బాలాజీ టెంపుల్ ,తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నారు.కల్చరల్ యాక్టివిటీస్ కోసం ఒక హాల్ గుడి ప్రాంగణం లో ఉంది.మేము వెళ్ళిన రోజు 6 గంటలకు సంగీత కచేరి ఉంది.చాలా టైం వెయిట్ చేయాల్సి వస్తుంది అని కచేరి కి అటెండ్ అవలేదు.వసిష్ఠ ఆశ్రమం లో ఉన్న స్ట్రీం(సంధ్య,కాంత,లలిత అనే మూడు నదుల సంగమం) లో ఒక మునక వేస్తే పాపాలు పోయి ఆయువు పెరుగుతుందని ,భక్తుల నమ్మకం.4 గంటలకే బాగా చీకటి పడిపోవటం తో ఫోటో అంత బాగా రాలేదు.
ఆశ్రమం దగ్గర ఉన్న నాగమందిరం |
బాలాజీ టెంపుల్ |
శ్రీమంత శంకరదేవ కళాక్షేత్ర మరియు అస్సాం స్టేట్ మ్యూజియం తప్పక చూడాల్సినవి . వాటి గురించి తర్వాతి పోస్ట్ లో !
1 comment:
గుడ్, థాంక్స్ చెప్పాలండీ మీకు, ఇవేవీ నాకు ఇంతకు మునుపు తెలియదు
Post a Comment