Kba falls నుంచి ఇకో పార్క్ కి వెళ్ళాము.వర్షాకాలం లో వెళ్ళటం బెస్ట్ అనుకుంటా,అక్కడ చూడటానికి ఏమీ లేదు. కొండ పైనుంచి కనిపించే మైదానాలు బంగ్లాదేశ్ లోవి అన్నారు.అందులో నిజం ఎంతో తెలియదు.ఒక వాటర్ ఫాల్ ఉంది కాని ,నీరే లేదు :)
అదే వాటర్ ఫాల్ (గూగుల్ సౌజన్యం తో )
Nohkalikai Falls - ఈ జలపాతానికి ఆ పేరు పెట్టటం వెనక ఒక భయంకరమైన కథ ఉంది . kalikai అనే అమ్మాయి భర్త చనిపోవటం తో రెండో పెళ్ళి చేసుకుంటుంది.ఆవిడ కి ఒక కూతురు . ఆవిడ పనికి వెళ్ళినప్పుడు ,భర్త - ఆ అమ్మాయి ని చంపి కూర వండుతాడు. kalikai తిరిగి వచ్చినాక కూతురు గురించి అడిగితే నాకు తెలియదు అంటాడు . ఆ అమ్మాయిని వెతకటానికి బయలుదేరబోతుంటే ఏమైనా తిని వెళ్ళమని ఆ కూరను తనతో తినిపిస్తాడు.తిన్న తర్వాత వెతకటానికి వెళ్ళబోతూ వక్కల బుట్టలో కూతురి చేతి వేళ్ళు చూసి తట్టుకోలేక దూకి చనిపోతుంది. అందుకే ఆ పేరు - Fall of Ka Likai
ఫాల్స్ కి వెళ్ళే దారి లో
పొగ మంచు తో కప్పేసి |
No comments:
Post a Comment