Wednesday, 8 January 2014

హయగ్రీవ మాధవుని చూడటానికి హజో ...

సుక్రేశ్వరుని దర్శించుకున్నాక హజో కి బయలుదేరాము.హజో కి వెళ్ళే దారి లో సరాయిఘాట్ బ్రిడ్జ్ వస్తుంది.ఇది బ్రహ్మపుత్రా నది మీద కట్టిన మొదటి రైల్ కం రోడ్ బ్రిడ్జ్.అస్సాం ని మిగతా దేశం తో కలిపే ముఖ్యమైన లింక్ . సరాయిఘాట్ చారిత్రాత్మక ప్రాముఖ్యత కలిగిన స్థలం.(మొఘలు లకు మరియు అస్సాం ను పరిపాలించిన అహోం రాజులకు మధ్య యుద్ధం జరిగిన ప్రదేశం) బ్రహ్మపుత్రా నది అందాన్ని చూస్తూ బ్రిడ్జ్ ఫోటో తీయలేదు :) హజో వెళ్ళే దారిలో రోడ్ కిరువైపులా పచ్చగా కంటికి ఆహ్లాదం కలిగిస్తూ ఆవాల చేలు. 

     
 గుడికి చేరుకునేటప్పటికి 12:30 అయ్యింది.మెట్లు చూసేప్పటికి నీరసం వచ్చేసింది.కడుపు లో ఎలుకలు కాదు,పందికొక్కులు పరుగేడుతుండటం తో అక్కడే ఉన్న స్వీట్ షాప్ లో సమోసాలు కొనుక్కుని తిన్నాము.తర్వాత ,ఆవునెయ్యి వత్తులు వేసి ఉన్న ప్రమిదలు కొనుక్కుని మెల్లగా మెట్లు ఎక్కడం మొదలు పెట్టాము. 


 పిక్ లో కనిపిస్తున్న కొలను పేరు Madhab Pukhuri .
 ఈ గుడి మోనికుట్ కొండ పైన ఉంది.1583 లో రఘుదేవ నారాయణ్ అనే రాజు కట్టించాడు.కొంతమంది చరిత్రకారులు ప్రకారం 6వ శతాబ్దం లో పాలా డైనాస్టీ కి చెందిన రాజులు కట్టించారని... 
హయగ్రీవ మాధవుని గురించి వివిధ కథలు ప్రాచుర్యం లో ఉన్నప్పటికీ ,ఆ గుడి లోని పండా చెప్పిన ప్రకారం...
 
కాశ్యప ప్రజాపతి కొడుకయిన హయగ్రీవుడు అనే రాక్షసుడు మునులను,దేవతలను హింసిస్తూ ఉండటం తో వాళ్ళు ఆ రాక్షసుని బారి నుంచి తమను కాపాడమని విష్ణువు ని ప్రార్ధించారట.ఆ రాక్షసుడుని సంహరించటానికి విష్ణువు హయగ్రీవుని   అవతారం ధరించారట.
 
    




   

No comments: