Monday 13 January 2014

Wah Kba Falls - Sohra

Mawkdok Dympep Valley 

ఇది షిల్లాంగ్ నుంచి చిరపుంజీ వెళ్ళే దారి లో వస్తుంది. ఆ కొండల నడుమ మబ్బులు తేలియాడుతూ ఉంటూ ఆ అందం చూడాల్సిందే ,చెప్పటానికి అవదు . 



వ్యాలీ నుంచి Wah Kba జలపాతాలు దగ్గరకు వెళ్ళాము. 
ఈ జలపాతాలు చూడటానికి లోయలో కి వెళ్ళాలి.మెట్లు దిగుతూ ఉన్నాము కాని ,ఎక్కడ జలపాతాలు ఉనికి లేదు.కొంత దూరం వెళ్ళాక మెట్లకు రెండు వైపులా మొగలి పొదలు ,అడవి లా ఉంది.ఎక్కడా జనాలు కూడా కనిపించటం లేదు.మొగలి పొదలు లో పాములు ఉంటాయంటారు కదా,కొంచం భయం వేసింది.తిరిగి వెళ్లి పోదామంటే ,వచ్చిన దూరం తలుచుకుంటే పైకి వెళ్ళే కంటే ఎలాగో అలా వెళ్లి ఫాల్స్ ని చూసి రావటమే బెటర్ అనిపించింది.ఇంతలో ఒక అమ్మాయి ఎదురైంది.ఆ అమ్మాయిని ఇంకా ఎంత దూరం ఉంది అని అడిగాము.చివరి వరకు వెళ్ళలేక మధ్య లో నుంచే వచ్చేసాను అని చెప్పింది.అలా నెమ్మది గా వెళుతూ ఈ ప్లేస్ కి చేరుకున్నాము.

                  
 దాన్ని చూడగానే నీరసం వచ్చేసింది.దీని కోసమా ఇంత శ్రమ పడింది అనిపించింది.ఇది కాదు ,ఇంకా చాలా క్రిందకు వెళ్ళాలి అని ఒకరు చెప్పారు. మళ్లీ నడవటం మొదలు పెట్టాము.ఇంకో మజిలీ !



     ఈ నీటి దగ్గర కొంతమంది పిల్లలు ,పెద్దవాళ్ళు ఫోటో లు దిగుతూ ,నీటితో ఆడుకుంటూ కనిపించారు.అప్పటి వరకూ జనాలు ఎవరూ కనిపించటం లేదు అనుకున్నాము కదా ,వాళ్ళను చూడగానే కొంచం రిలీఫ్ !మేము కూడా ఫోటోస్ తీసుకుని కొంచం సేపు అక్కడ ఉండి మళ్ళీ బయలుదేరాము.ఈ సారి కూడా చివరి వరకు వెళ్ళలేదు కానీ ,మధ్యలో నుంచే ఫాల్స్ ని చూసి తిరిగి వచ్చేసాము. 

  
ఫాల్స్ ని చూడటానికి వెళ్ళినప్పుడు సగం దూరం లోయ లోకి వెళ్ళినాక తీసిన ఫోటో

No comments: