Tuesday 21 January 2014

హరిక్షేత్రే కామరూపీ

అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటి - కామాఖ్య మందిర్ ,అస్సాం లోని గౌహాతి లో ఉంది.హరిక్షేత్రే కామరూపీ అని స్తుతించారు అంటే ఒకప్పుడు గౌహాతి ని హరిక్షేత్రం అని వ్యవహరించే వారేమో ! అస్సాం స్టేట్ మ్యూజియం లో ఉన్న ,పురావస్తు శాఖ తవ్వకాలలో బయల్పడిన 10వ శతాబ్దం నాటి విగ్రహాలు   చాలావరకు విష్ణుమూర్తివే !
ఈ ట్రిప్ లో ,నాకు చాలా చిరాకు తెప్పించిన ప్రయాణం అంటే ఇదే !దర్శనానికి సుమారు 6 గంటలు పైనే పట్టింది . అంత సేపు క్యూ లో నిన్చోటం నిజం గా నరకం.ఒక ప్రక్క జనరల్ క్యూ లో ఉన్న వాళ్ళ భజనలు హొరెత్తుతూ ఉంటే ,మా క్యూ లో వెనక ఉన్న వాళ్ళ -  గేట్ ఖోల్ దో,చోడ్ దో అన్న అరుపులు,పిల్లల ఏడుపు బాక్గ్రౌండ్ మ్యూజిక్ ... 

ఇంతలో ఢాం అనే శబ్దం ! ఏమిటా అని తల త్రిప్పి చూస్తే ,పావురం రెండు గా చీలిపోయి పడి ఉంది.ఒక్క క్షణం అలా ఎలా పడింది అన్నది అర్ధం కాలేదు,బలి ఇచ్చారు అని తర్వాత అర్ధం అయ్యింది.

                     క్యూ లో ఉన్నప్పుడు పైనుంచి తీసినది ,పావురం ఆ వాకిలి దగ్గరే పడింది 

క్యూ లో ముందుకు వెళ్ళిన తర్వాత దృశ్యాలు  ఏమిటంటే ,పావురాలు అమ్మే వాళ్ళు ,బలి ఇచ్చిన మేక తల,తల లేని పావురం శరీరం ఇత్తడి పళ్ళెం లో పెట్టుకుని వెళ్తున్న పండాలు ,వారి వెనకే భక్తి పారవశ్యం లో భక్తులు ... అది చూడలేక ఎందుకొచ్చాను రా భగవంతుడా అని మనసులోనే మొత్తుకున్నాను . 









4 comments:

Unknown said...

.ఫొటోలు బాగున్నయండి ..radhika (naani)

సప్త స్వరాలు said...

వాళ్ళందరూ కలియుగ కన్నప్పలు అనుకుంటున్నారు. ఎవరి భక్తి వారిది .
All I have seen teaches me to trust the Creator for all I haven't seen .
అని మీరే వ్రాసుకున్నారు కదండీ ... అందుకని Trust the Creator and be happy. :)

Anuradha said...

థాంక్యూ రాధిక గారు !

Anuradha said...

@ sapta swaraalu

నేను ఆ భక్తులను ఏమీ అనలేదు అండి.క్రియేటర్ ని ట్రస్ట్ చేయటం లేదని కూడా ఎక్కడా రాయలేదు.ఆ బలి ఇవ్వటం అన్నది చూడలేక ఇబ్బంది పడ్డాను అని మాత్రమే రాసాను .